ఈ నెల 22 నుంచి పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ
ఆంధ్ర ప్రదేశ్ : సివిల్, APSP విభాగంలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలోని 21 పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, బెటాలియన్‌లలో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 21వ తేదీ తమకు కేటాయించిన శిక్షణ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఇటీవల వీరికి సీఎం నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే.










Comments