ఉపాధి హామీ శ్రామికులకు రూ.988కోట్లు విడుదల: పెమ్మసాని
ఆంధ్ర ప్రదేశ్ : ఉపాధి హామీ శ్రామికుల వేతనాల కోసం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.988 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏపీకి MGNREGA కింద ఇప్పటి వరకు రూ.7,669 కోట్లు అందాయని చెప్పారు. ఇందులో రూ.5,660 కోట్లు కూలీల వేతనాలకు, రూ.2,009 కోట్లు పనుల సామగ్రి, పరిపాలనా ఖర్చులకు కేటాయించినట్లు ఆయన ట్వీట్ చేశారు.










Comments