• Dec 21, 2025
  • NPN Log

    వాషింగ్టన్‌ : అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ రాసలీలలు కూడా బయటకు వచ్చాయి. అమెరికా చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ఈ లైంగిక కుంభకోణం సూత్రధారి జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఆ దేశ రాజకీయ, వ్యాపార ప్రముఖులు, సెలబ్రిటీలకు ఉన్న సంబంధాలను వెల్లడి చేసే 6 లక్షల పేజీల డాక్యుమెంట్లను అమెరికా న్యాయశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ పత్రాల విడుదలకు అనుమతిస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ నవంబర్‌ 19న ఆదేశాలపై సంతకం చేయగా, సరిగ్గా నెల తర్వాత వాటిని బయటపెట్టారు. ఈ పత్రాల విడుదలకు ప్రతిపక్ష డెమోక్రాట్లు భారీ ఉద్యమమే నడిపారు. అయితే, తీరా ఆ పత్రాల్లో ట్రంప్‌ కంటే డెమోక్రాటిక్‌ నేత క్లింటన్‌ రాసలీలలే అధికంగా ఉండటం సంచలనంగా మారింది. ఎప్‌స్టీన్‌కు చెందిన లగ్జరీ చార్టర్డ్‌ విమానంలో క్లింటన్‌ ఓ యువతిని తన తొడపై కూర్చోబెట్టుకొని ప్రయాణం చేస్తున్న ఫొటోతోపాటు ఈత కొలనులో ఎప్‌స్టీన్‌ సహచరి, ఈ కుంభకోణంలో మరో ప్రధాన నిందితురాలు ఘిస్లైన్‌ మ్యాక్స్‌వెల్‌తో ఉన్న ఫొటో, బాత్‌ టబ్‌లో ఓ యువతితో మసాజ్‌ చేయించుకుంటున్న ఫొటో తాజాగా విడుదలైన పత్రాల్లో ఉన్నాయి. ఎప్‌స్టీన్‌తో మైఖేల్‌ జాక్సన్‌ కలిసి ఉన్న ఫొటో కూడా బయటకు వచ్చింది.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement