• Oct 24, 2026
  • NPN Log

    చండీగఢ్‌ : పంజాబ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన పనిచేస్తున్న ఉపాధి కూలీలసు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంగ్రూర్‌ జిల్లాలోని లెహ్రాగాగా- జాఖల్‌ రహదారిపై చోటియాన్‌ గ్రామం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దాదాపు 25 మంది ఉపాధి హామీ కూలీలు రహదారి పక్కన పనులు చేసి, కాసేపు సేదదీరుతున్నారు. ఆ సమయంలో ఒక వెర్నా ఒక్కసారిగా అదుపుతప్పి వారిపైకి దూసుకొచ్చింది. కారు బలంగా ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారిలో ఆరుగురు మహిళా కూలీలు ఉన్నారు. పలువురు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయిన ఒక కారు, అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని 11 ఏళ్ల చిన్నారి సహా ఐదురుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధితులంతా మజల్‌గావ్‌ నివాసితులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా తుల్జాపూర్‌లోని భవానీ మాత ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ విషాదం ముంచెత్తింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. బస్సు ముందు భాగం కూడా దెబ్బతిన్నప్పటికీ, అందులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement