• Oct 24, 2026
  • NPN Log

    కోలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నేపథ్య గాయకుడు  కృష్ణరాజ్ (76) అనారోగ్యంతో గురువారం ఉదయం కన్నుమూశారు. ఇటీవల తుదిశ్వాస విడిచిన సంగీత దర్శకుడు దేవాకు.. కృష్ణరాజ్ఎంతో ఇష్టమైన గాయకుడు కావడం గమనార్హం. తమిళంలో దాదాపు 300కు పైగా పాటలు పాడారు. తన ప్రత్యేకమైన స్వరంతో తమిళ చిత్ర పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించిన కృష్ణరాజ్ గానం చేసిన పాటల్లో 'తిరుపతి ఏళుమలై వెంక టేశ..', 'కాత్తు అడిక్కుదు.., 'సిరిచ్చిట్టు పోనాలుమ్' వంటి ఎన్నో సూపర్హీట్ సాంగ్స్ ఉన్నాయి. అన్నింటికంటే మురళి హీరోగా నటించిన 'పొర్కాలం' చిత్రంలోని 'తంజావూరు మన్ను ఎడుత్తు' అనే పాట ఆయనకు కీర్తితో పాటు పేరు తెచ్చిపెట్టింది.

    2000 సంవత్సరం తర్వాత ఆయన 'పరుత్తి వీరన్'లో 'అయ్యయ్యో' 'కళుగు' మూవీలో 'ఆంబైకు పొంబైకు' పాటలు పాడారు. సూర్య హీరోగా నటించిన 'సూరరైపోట్రు లో ఒక పాట ఆలపించారు. కాగా కృష్ణరాజ్ భౌతికకాయాన్ని ప్రజలు, సినీ ప్రముఖులు, సినీ అభి మానుల సందర్శనార్థం స్థానిక వలసరవాక్కంలోని ఆయన నివాసంలో ఉంచగా, సేలం జిల్లాలోని వీరపాండి పంచాయతీ పరిధి లోని వేంబడిదళం గ్రామానికి తరలించి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

    హృదయాలను గెలుచుకున్న‌ గాయకుడు: సీఎం

    గాయకుడు కృష్ణ రాజ్ మృతిపట్ల ముఖ్య మంత్రి విజయ్ (CM Vijay ) తన ప్రగాడ సంతాపం, సానుభూతిని వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఆయన తన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు ' నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ మరణ వార్త విని నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. దేవా మరణించిన కొద్ది రోజులకే ఆయన అభిమాన గాయకుడు కూడా కన్నుమూయడం తీవ్ర బాధకు గురి చేసింది. గాయకుడు కృష్ణరాజ్ మరణం తమిళ చిత్ర సీమకు తీరని లోటు. కృష్ణరాజ్ మృతితో విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు, చిత్రపరిశ్రమకు, సంగీత అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని పేర్కొన్నారు. అలాగే, మరికొంతమంది సినీ ప్రముఖులు తమ సంతాప సందే శాలను వెల్లడించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement