• Oct 24, 2026
  • NPN Log

    సూపర్ హిట్‌ మూవీ 'కొత్త బంగారు లోకం'లో జంటగా నటించిన వరుణ్‌ సందేశ్‌, శ్వేతా బసు ప్రసాద్ మరోసారి జత కట్టిన సినిమా ' నా వైఫ్‌ మిస్సింగ్‌'. ఈ సినిమా నుంచి ఇప్పటికీ టీజర్‌ విడుదలై, సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. అలానే తాజాగా లిరికల్‌ వీడియో విడుదలైంది. ఈ సినిమాను లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై శివ కంఠంనేని నిర్మించారు. స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు. అరెరే విన్నావా అంటూ సాగే ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి పాడారు. 'నా వైఫ్ మిస్సింగ్‌' మూవీ ఆహా ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).