నేటి నుంచి జేఎన్టీయూఏలో ఇన్నోవేటర్స్ కాంక్లేవ్
అనంతపురం : అనంతపురం జేఎన్టీయూలో రెండ్రోజుల పాటు అంతర్జాతీయ నూతన ఆవిష్కర్తల సమాలోచన సదస్సు (ఇన్నోవేటర్స్ కాంక్లేవ్) నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంగా భవిష్యత్తు ప్రణాళికలపై కాంక్లేవ్‌లో ప్యానల్ చర్చలు జరగనున్నాయి. ఈ కార్యక్రమ వివరాలను జేఎన్టీయూఏ వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు శుక్రవారం వెల్లడించారు. కాన్క్లేవ్ వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం www.innovatorsconclave.org.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.









Comments