పిల్లల ఎదుట గొడవ పడుతున్నారా?
తల్లిదండ్రుల మధ్య గొడవలు పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే అది పిల్లల్లో భయం, ఆందోళనకు దారితీస్తుంది. దీర్ఘకాలంలో ఇవి వారి మానసిక ఆరోగ్యం, చదువు, నిద్ర, సామాజిక సంబంధాలను దెబ్బతీయవచ్చు. అలాగే పెద్దలను అనుకరించే పిల్లలు అదే ప్రవర్తనను తమ జీవితంలో అలవర్చుకునే ప్రమాదముంది. తల్లిదండ్రులు విభేదాలను శాంతంగా పరిష్కరించుకోవాలి.










Comments