రూ.2 కోట్ల విలువైన పార్కును కాపాడాలి
అధికారుల తీరుపై పౌర సంక్షేమ సంఘం ఆగ్రహం
(కర్నూలు): నగరంలోని రేణుకా నగర్ లో రూ.2 కోట్లు విలువ చేసే 20 సెంట్ల పార్కు స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు ఇరిగినేని పుల్లారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కాలనీలో పర్యటించిన ఆయన.. పార్కు కోసం అధికారులను కలిసినప్పుడల్లా ప్రైవేటు వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్పీ నెం.453 గల పార్కును సర్వే చేసి బోర్డు ఏర్పాటు చేయాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సి.శ్రీరాములు, పి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.









Comments