శంషాబాద్‌కు మరో బాంబు బెదిరింపు మెయిల్
తెలంగాణ : ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. అమెరికాకు వెళ్లే విమానంలో బాంబు ఉందని, పేలుడు జరగకుండా ఉండాలంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టు అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ మెయిల్ అమెరికాకు చెందిన జాస్పర్ పంపినట్లు ప్రాథమికంగా గుర్తించారు.










Comments