సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఆంధ్ర ప్రదేశ్ : ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న ఈ ఏడాదిలోనే అత్యల్పంగా అల్లూరి(D) దళపతిగూడలో 3.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 3-4డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం వరకు అధిక పీడనం కొనసాగడం వల్ల గాలులు వీస్తున్నాయని, ఫలితంగా చలి పెరిగిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13వ తేదీ వరకు చలి కొనసాగుతుందని పేర్కొంది.










Comments