అవినీతిని అడ్డుకునేందుకు ఏఐ మినిస్టర్.. ఎక్కడో తెలుసా?
ప్రపంచంలోనే ఏఐ ఆధారంగా పనిచేసే మంత్రిని అల్బేనియా దేశం నియమించింది. ఈ ఏఐ మహిళా మంత్రికి ‘డియెల్లా’ అని పేరు పెట్టింది. ఈమె అన్ని ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించిన బాధ్యతలను పర్యవేక్షిస్తారు. దీనిద్వారా అల్బేనియా ప్రభుత్వం అవినీతిని తగ్గించొచ్చని భావిస్తోంది. అల్బేనియాలో ప్రభుత్వ టెండర్లు & ప్రజా నిధుల కేటాయింపుల్లో భారీగా అవినీతి జరుగుతుందనే ఆరోపణలున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.
Comments