అసూయపడేవాళ్లకి ఇలా చెక్
మనల్ని చూసి అసూయపడే వాళ్లు, గాసిప్స్ ప్రచారం చేసేవాళ్లు చుట్టూ ఉంటారు. వారివల్ల ముఖ్యంగా సెన్సిటివ్‌గా ఉండే మహిళలు ఇబ్బందులు పడతారు. వీరికి చెక్ పెట్టాలంటే ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండండి. పూర్తిగా పనిపైనే ఫోకస్ చేయండి. మీ వెనకాల వినిపించే మాటలను అసలు పట్టించుకోవద్దు. అసూయపరులు ఎదురైతే ఆలోచించి నెమ్మదిగా రెస్పాండ్ అవ్వండి. చనువు ఎక్కువ ఇవ్వొద్దు. దీంతో అలాంటివారు దూరంగా జరుగుతారు.
Comments