ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన కామెంట్స్.. సీఎం రేవంత్‌రెడ్డిది రాతిగుండె
హైదరాబాద్: రేవంత్‌రెడ్డిది రాతిగుండె కాకపోతే ఒక్కడిగా వచ్చి ఒక అరగంట చిక్కడపల్లి లైబ్రరీలో చదవండి, నిరుద్యోగ విద్యార్థుల సమస్య తెలుస్తుంది అని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడానికి శుక్రవారం సాయంత్రం ఆయన చిక్కడపల్లిలోని హైదరాబాద్ నగర కేంద్రగ్రంథాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా నిరుద్యోగులతోపాటు కలిసి లైబ్రరీలో గంటపాటు పుస్తకాలను చదివారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఏమీ చదువుకోలేదు కాబట్టి ఆయనకు ఏమీ తెలియదన్నారు. ఒక నేరస్థుడు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తారా బాబాసాహెచ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం పాటిస్తారా పోలీసులు ఆలోచించుకోవాలన్నారు. ప్రభుత్వం పంతానికి పోకుండా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు.
గ్రూప్-1 అవకతవకలపై బీఆర్‌ఎస్(BRS) పార్టీ ప్రతినిధిగా ‘నేను మాట్లాడితే తప్పు ఏంటీ’ అని ప్రశ్నించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తుందని కోర్టు తీర్పునిచ్చిందన్నారు. వెంటనే ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలు మొదటి విడతగా నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు. ఆర్టికల్ 19(1) ప్రకారం నాకున్న స్వేచ్ఛతో ఇక్కడికి వచ్చానన్నారు. నేను దేశంలో ఎక్కడైనా తిరగవచ్చన్నారు.
Comments