బండిపై క్యాస్ట్ పేరుంటే జరిమానా!
అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు కుల వివక్షను రూపు మాపేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. ‘క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్‌లో నేరస్థుల కులానికి బదులు పేరెంట్స్ పేర్లు పెట్టాలి. పోలీస్ స్టేషన్లో నిందితుల పేర్లు ప్రదర్శించేటప్పుడు కుల ప్రస్తావన వద్దు. వాహనాలపై కులం పేరు, కులాన్ని కీర్తిస్తూ స్లోగన్స్/కోట్స్ ఉంటే ఫైన్ వేయాలి. సోషల్ మీడియా లో ఏ కులాన్నైనా కీర్తించినా/కించపరిచినా చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది.
Comments