ఇక ఎగ్జామ్ పేపర్స్ షేర్ చేస్తే జైలుకే!
అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియా, ఆన్‌లైన్లో ఎగ్జామ్ పేపర్స్‌పై చర్చించడం, షేర్ చేయడం నేరమని తెలిపింది. ఇలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయంది. దేశవ్యాప్తంగా పబ్లిక్ ఎగ్జామ్స్‌లో అవకతవకలు నివారించడానికి కేంద్రం ఇటీవల పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జైలు శిక్ష, భారీ ఫైన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హెచ్చరించింది.
Comments