ఇంటర్లో ప్రవేశాలు.. రెండు రోజులే ఛాన్స్
తెలంగాణ : ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇవాళ, రేపు ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ చేస్తామని బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం రూ.500 ఫైన్ చెల్లించాలని, ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలకు అవసరం లేదని తెలిపారు. స్టూడెంట్స్ ఇప్పటికే సమర్పించిన వివరాల్లో తప్పులనూ సవరించుకోవచ్చన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.
Comments