ఇక విండోస్ 10కి కాలం ముగిసినట్లే!
అక్టోబర్ 14 నుంచి విండోస్ 10కు ఎలాంటి సెక్యూరిటీ అప్డేట్స్ ఉండబోవని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే సపోర్ట్ నిలిపివేసినా OS మాత్రం పనిచేస్తుందని పేర్కొంది. సెక్యూరిటీ రిస్క్, మాల్వేర్, కంపాటబిలిటీ వంటి సమస్యలతో ముప్పు ఉందని వివరించింది. యూజర్లను విండోస్ 11కు అప్గ్రేడ్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. విండోస్ 10నే వినియోగించాలనుకుంటే ఏడాదిపాటు ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ కవరేజీకి అవకాశం కల్పిస్తోంది.
Comments