ఈ నెల 10 నుంచి ఓటీటీలోకి ‘మిరాయ్’
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జ, రితికా నాయక్ జంటగా తెరకెక్కిన ‘మిరాయ్’ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 10నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీలో మంచు మనోజ్, శ్రియ, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు.
Comments