ఒకప్పటి హీరోహీరోయిన్లు ఇప్పుడెలా ఉన్నారో చూడండి!
చెన్నైలో జరిగిన 80వ దశకం సినీ తారల రీయూనియన్లో స్టార్ నటీనటులు పాల్గొన్నారు. ఆనాటి హీరోలు, హీరోయిన్లంతా స్టైలిష్ ఔట్‌ఫిట్స్‌లో మెరిశారు. ఆరుపదుల వయసులోనూ తగ్గేదేలే అంటూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి Xలో షేర్ చేశారు. ‘80ల నాటి నా ప్రియమైన స్నేహితులను కలిసినప్పుడల్లా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ప్రతి సమావేశం మొదటిదానిలానే కొత్తగా అనిపిస్తుంది’ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
Comments