కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సర్పంచ్ రమణి.
అల్లూరిసీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, రాజవొమ్మంగి మండలం,రాజవొమ్మంగి సర్పంచ్ రమణి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి చిన్న, గొల్లపల్లి ప్రసాద్, జనసేనపార్టీ ప్రెసిడెంట్ మూర్తి, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments