రోడ్లపై వున్న పశువులను గోశాలకు అప్పగింత ! తహసీల్దార్ అల్లు. సత్య నారాయణ
అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, రాజవొమ్మంగి మండలం రాజవొమ్మంగి NH 516E రోడ్డు పైనే తిరుగు తున్నాయి,వాటివల్ల ఎందరో వాహనదారులు ప్రమాదాలకు గురికావటం తెలిసిన విషయమే,ఈ పశువుల విషయమై ఎం.ఆర్.ఒ. అల్లు సత్య నారాయణ, ఎస్.ఐ.నర్సింహ మూర్తి పశువుల ఎజమానులను పిలిచి వారిని హెచ్చరించి, నోటీసులుయివ్వటం జరిగినపశువుల ఎజమానుల తీరు మారలేదు.దీనితో తహసీల్దార్ అల్లు. సత్య నారాయణ పోలీస్ సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి మినీ వాన్ లో పశువులను గోశాలకు తరలించారు.
Comments