కృత్రిమ మేధతో ప్రపంచ జీడీపీకి అదనంగా
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) 21వ శతాబ్దిని నిర్వచించే టెక్నాలజీగా మారిందని, 2030 నాటికి ప్రపంచ జీడీపీకి ఇది 1570 కోట్ల డాల ర్లు (రూ.1,382 లక్షల కోట్లు) జోడిస్తుందని ఫిక్కి-బీసీజీ రూపొందించిన ఒక శ్వేతపత్రంలో అంచనా వేశాయి. అయితే ఏఐని అనుసరించే విషయంలో మాత్రం భారీ వ్యత్యాసాలున్నట్టు ఆ పత్రంలో తెలిపాయి. ప్రపంచ సమ్మిళిత వృద్ధికి ఏఐని ఒక సాధనంగా చేసుకోవాలని పిలుపు ఇచ్చాయి. ఏఐని అందరికీ అందుబాటులోకి తేవడానికి పరిశోధన, పెట్టుబడులు, నైపుణ్యాల కల్పన, నైతిక (రైజ్) నియమావళి అనుసరించాలని సూచించాయి. అందులోని ప్రధానాంశాలు...
ఈ రంగంలో పరిశోధనలు, ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వ-ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలి.
ఏఐని అందరికీ ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాలకు అందుబాటులోకి తేవడం లక్ష్యంగా పెట్టుబడులు, మౌలిక వసతులు విస్తరించాలి.
ఏఐ ప్రతిభలో వ్యత్యాసాలు తొలగించేందుకు సిబ్బందిలో నైపుణ్యాలకు మెరుగులు దిద్దడంతో పాటు ఏఐ పరిజ్ఞానాన్ని అందరూ భారీ ఎత్తున పంచుకునే వాతావరణం సృష్టించాలి.
ఏఐ వ్యవస్థలు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా ఉండేలా చూసేందుకు శక్తివంతమైన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
Comments