• Apr 05, 2026
  • NPN Log

    హరారే: అండర్‌-19 ప్రపంచకప్‌ ఆఖరి అంకానికి చేరింది. అంచనాలకు తగ్గట్టుగానే భారత యువ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అదరగొట్టారు. ఆయుష్‌ మాత్రే బృందం ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండా తుది పోరుకు అర్హత సాధించడం విశేషం. ఇక శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగే ఫైనల్లోనూ ఎలాంటి అలక్ష్యానికి తావీయకుండా చెలరేగాలని భావిస్తోంది. అదే జరిగితే భారత్‌ ఖాతాలో ఆరో టైటిల్‌ చేరుతుంది. 2022లో మన కుర్రాళ్లు చివరిసారి ఇంగ్లండ్‌ జట్టుపైనే గెలిచి కప్‌ సాధించారు. కానీ 2024లోనూ కప్‌ కోసం పోరాడినా ఆసీస్‌ చేతిలో ఓడి రన్నర్‌పతో సంతృప్తి పడాల్సి వచ్చింది. దీనికి ముందు జరిగిన 15 టోర్నమెంట్లలో యువ భారత్‌ తొమ్మిది సార్లు ఫైనల్‌కు చేరి, ఐదుసార్లు విశ్వవిజేతగా నిలవడం జట్టు ఆధిపత్యాన్ని సూచిస్తోంది. మహ్మద్‌ కైఫ్‌, విరాట్‌ కోహ్లీ, ఉన్ముక్త్‌ చంద్‌, పృథ్వీ షా, యష్‌ ధుల్‌ సారథ్యంలో భారత్‌కు ట్రోఫీలు లభించాయి. మరోవైపు ఇంగ్లండ్‌కిది మూడో ఫైనల్‌ కాగా 1998 తర్వాత మరోసారి విజేతగా నిలవాలని ఆరాటపడుతోంది. భారత్‌లాగే ఈ జట్టు ఖాతాలోనూ ఒక్క ఓటమి లేకపోవడం గమనార్హం. పైగా సెమీ్‌సలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆసీ్‌సను ఓడించి ఊపు మీదుంది. దీంతో ఫైనల్‌ సమరం అత్యంత ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహం లేదు.

    ఫేవరెట్‌గా..

    టైటిల్‌ పోరుకు ముందే భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ మరింత పటిష్టంగా మారడం జట్టుకు సానుకూలాంశం కానుంది. ఇక ఓపెనర్‌ వైభవ్‌ విధ్వంసకర ఆటతీరు తెలిసిందే. విహాన్‌, వేదాంత్‌ మిడిలార్డర్‌లో ఆదుకుంటున్నారు. బౌలింగ్‌లో అంబరీష్‌, హెనిల్‌, ఖిలన్‌లతో పాటు ఆయుష్‌ సైతం వికెట్లను పడగొడుతున్నాడు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement