గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ
వాడి గాజా : యుద్ధరంగమైన గాజాలో శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ తిరుగుబాటుదార్లు కాల్పులను విరమించారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఇజ్రాయెల్ మిలటరీ మధ్యాహ్నం ప్రకటించింది. అంతకుముందు ఇజ్రాయెల్ మంత్రివర్గం సమావేశమయి యుద్ధంలో విరామం పాటించాలని నిర్ణయించింది. హమాస్ విడుదల చేయనున్న బందీలకు బదులుగా పాలస్తీనా ఖైదీలను అప్పగించాలని కూడా తీర్మానించింది. కాల్పులను విరమించడంతో సెంట్రల్ గాజాలోని వాడీ గాజాలో వేలాది మంది చేరారు. అక్కడి నుంచి గాజాలోని ఉత్తర ప్రాంతానికి నడక ప్రారంభించారు. కాగా, గాజాలోని అన్నార్థులకు ఆదివారం నుంచి ఆహారం అందించనున్నట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
Comments