అమెరికా ఆయుధ తయారీ ఫ్యాక్టరీలో పేలుడు
టెన్నిస్సీ : అమెరికా టెన్నిస్సీలోని ఆయుధ తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి 19 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. అక్యురేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్ ఫ్యాక్టరీలో సంభవించిన ఈ పేలుడు ధాటికి భవనం పూర్తిగా నేలమట్టమైంది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీలోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మంటలు చెలరేగడంతో పాటు పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు 17 కిలోమీటర్ల వరకు వినిపించాయని స్థానికులు తెలిపారు.
Comments