జురెల్ క్రికెట్ జర్నీ అద్భుతం: దినేశ్ కార్తీక్
సెంచరీ హీరో ధ్రువ్ జురెల్ క్రికెట్ కెరీర్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ చెప్పారు. ఆయన ప్రయాణం అద్భుతమని కొనియాడారు. కెరీర్ ప్రారంభంలో జురెల్ తల్లి నగలు తాకట్టు పెట్టి క్రికెట్ కిట్ కొనిచ్చారని తెలిపారు. డొమెస్టిక్ టోర్నీల్లో సత్తా చాటి టీమ్ ఇండియాకు ఎంపికయ్యారని గుర్తు చేశారు. తాజాగా అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ టెస్టుల్లో తొలి శతకం బాదారని ప్రశంసించారు.
Comments