ఆసీ్సదే టీ20 సిరీస్
మౌంట్ మాంగనూయ్: ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ (52 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 103 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. దీంతో శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో ఆసీస్ 3 వికెట్లతో నెగ్గింది. సిరీ్‌సను 2-0తో దక్కించుకుంది. రెండో మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. ముందుగా కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఓపెనర్ సైఫర్ట్ (48) అత్యధిక స్కోరర్. ఎబాట్‌కు మూడు.. బార్లెట్, హాజెల్‌వుడ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో పేసర్ జేమ్స్ నీషమ్ (4/26) ధాటికి ఆసీస్ తడబడింది. అయితే మార్ష్ అంతా తానై పోరాడడంతో ఆసీస్ 18 ఓవర్లలో 160/7 స్కోరు చేసి గట్టెక్కింది. డఫీకి 2 వికెట్లు లభించాయి.
Comments