జవాన్లకు కొత్త యుద్ధ తంత్రం.. డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ
దేశాన్ని రక్షించే జవాన్లకు టెక్నాలజీపై BSF శిక్షణ ఇస్తోంది. డ్రోన్ సాంకేతికతపై గ్వాలియర్(మధ్యప్రదేశ్)లో తొలుత 45 మందికి ట్రైనింగ్ ఇవ్వగా, రెండో బ్యాచ్‌కు కొనసాగుతోంది. ఏటా 500 మందికి తర్ఫీదు ఇచ్చి భద్రతను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భద్రతా బలగాలు ఈ టెక్నాలజీ నేర్చుకోవడం తప్పనిసరని BSF తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న యుద్ధ రీతులను మన జవాన్లూ అందుపుచ్చుకోవాలనేది లక్ష్యమని పేర్కొంది.
Comments