తుదిపోరుకు తన్వి
గువాహటి: వర్ధమాన షట్లర్ తన్వీ శర్మ.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో సైనా నెహ్వాల్, అపర్ణ పోపట్ తర్వాత ఈ టోర్నీ తుది పోరుకు చేరుకొన్న మూడో భారత మహిళా షట్లర్‌గా తన్వీ నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో తన్వి 15-11, 15-9 లి సి య (చైనా)పై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ అన్యపట్ పిచిట్‌ప్రీచెస్క్ (థాయ్‌లాండ్)తో తన్వి అమీతుమీ తేల్చుకోనుంది.
Comments