బ్రేకప్‌పై రష్మిక ఏమన్నారంటే?
రిలేషన్‌షిప్ బ్రేకప్ అయితే అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుందని స్టార్ హీరోయిన్ రష్మిక అన్నారు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారనే ప్రచారాన్ని తాను అంగీకరించనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బాధను వ్యక్తపరిచేందుకు తాము గడ్డం పెంచలేమని, మందు తాగలేమని అభిప్రాయపడ్డారు. లోలోపల అమ్మాయిలకే బాధ ఎక్కువగా ఉంటుందని, బయటకు చూపించలేరని చెప్పారు. ఆమె నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న రిలీజ్ కానుంది.
Comments