తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్
ఆంధ్ర ప్రదేశ్ : మొంథా తుఫాను పట్ల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ‘తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేయండి. తీరం వెంబడి గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి. షెల్టర్లలో ఆహారం, ఔషధాలు, పాలు వంటివన్నీ సమకూర్చండి. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పోలీస్, అగ్నిమాపక శాఖలతోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలి’ అని సూచించారు.










Comments