పాక్కు షాకిచ్చిన అఫ్గాన్..ఇండియాకు!
పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆ రెండు దేశాల క్రికెట్ పై తీవ్ర ప్రభావం చూపాయి. త్వరలో పాకిస్థాన్ లో జరగాల్సిన ట్రై సిరీస్ నుంచి ఆఫ్గాన్ జట్టు తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ వైమానిక దాడుల్లో తమ ముగ్గురు యువ క్రికెటర్లు మరణించడంతోనే ఆఫ్గాన్ ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా పాక్ కు ఆఫ్గానిస్తాన్ మరో షాకిచ్చింది. తన అండర్-19 జట్టును పాకిస్తాన్‌కు బదులుగా భారత్‌కు పంపాలని నిర్ణయించింది.
పాకిస్థాన్ తో ఆడటానికి నిరాకరించిన అఫ్గనిస్థాన్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించనుంది. అఫ్గనిస్థాన్ అండర్-19 క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జింబాబ్వే, నమీబియాల సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న అండర్-19 ప్రపంచ కప్ కోసం సన్నాహకంగా ఈ ట్రై సిరీస్ ఉపయోగపడుతుంది.
ఆఫ్గనిస్థాన్ అండర్-19, ఇండియా అండర్-19 'ఏ',ఇండియా అండర్-19 'బీ' జట్టులో ట్రై సిరీస్ ను ఆడనున్నాయి. ఈ యువ వన్డే ట్రై సిరీస్ 2025 నవంబర్ 17న ప్రారంభమవుతుంది. ప్రతి జట్టు మిగిలిన రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానం సంపాదించిన టాప్-2 జట్ల మధ్య నవంబర్ 30న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అన్ని మ్యాచ్‌లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరగనున్నాయి. ఇలా తమ క్రికెటర్లను పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్ కు ఆఫ్గానిస్తాన్ షాకుల మీద షాకిలిస్తుంది.
Comments