ప్రపంచబ్యాంకు నుంచి అమరావతికి మరో ₹1,750 కోట్లు!
ఆంధ్రప్రదేశ్ : అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు రెండో విడతగా ₹1,750 కోట్లు ఇవ్వనుంది. డిసెంబర్ నాటికి ఈ ఫండ్స్ వచ్చే అవకాశం ఉందని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ తెలిపారు. ‘తొలి విడతలో ప్రపంచబ్యాంకు విడుదల చేసిన ₹1,800 కోట్లలో 50% ఖర్చు చేశాం. ఇందులో 75% పూర్తయ్యాక రెండో విడత కోసం దరఖాస్తు చేస్తాం’ అని చెప్పారు. అమరావతి ప్రాజెక్టులకు ₹13,600 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని గతంలో వరల్డ్ బ్యాంక్, ADB ప్రకటించాయి.










Comments