వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ సవరణ!
దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను వచ్చే వారం నుంచి EC చేపట్టనుంది. తొలి దశలో 10-15 రాష్ట్రాల్లో ప్రారంభించనుందని తెలుస్తోంది. 2026లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ముందుగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టనున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికలు జరుగుతున్న, త్వరలో జరిగే రాష్ట్రాలను ఈ ప్రక్రియ నుంచి మినహాయించనుంది. కాగా తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో 2026లో ఎన్నికలు జరగనున్నాయి.









Comments