ఫుడ్ పాయిజనింగ్ కావొద్దంటే ఇవి మస్ట్!
తెలంగాణ : రాష్ట్రంలో గత 9 నెలల్లో 34K+ ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయి. దీనికి కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రతే కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ‘బయటి ఫుడ్, ఫ్రిడ్జిలో నిల్వ ఉంచిన ఆహారం తినొద్దు. వాడిన నూనె మళ్లీ వాడొద్దు. శుభ్రత పాటించాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. తినే ముందు, మలవిసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడగాలి. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వస్తే వైద్యుడిని సంప్రదించాలి’ అని సూచిస్తున్నారు.










Comments