నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బుక్కరాయసముద్రం మండలంలోని ప్రతిభా పాఠశాల పైన చర్యలు తీసుకోవాలి
రేకుల షెడ్డు,,ఇళ్ళల్లో స్కూల్ నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?
జిల్లావ్యాప్తంగా రేకుల షెడ్డులో పాఠశాలలో నిర్వహిస్తున్న వాటిపైన చర్యలు తీసుకోవాలి
సెలవు దినాలలో తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద ధర్నాఅనంతపురం అర్బన్:: ప్రభుత్వా నిబంధనలకు విరుద్ధంగా బుక్కరాయసముద్రం మండలంలో నిర్వహిస్తున్న ప్రతిభ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని జిల్లావ్యాప్తంగా రేకుల షెడ్డులలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల పైన విచారణ జరిపి సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిఇఓ కార్యలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఏడి మునీర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి హనుమంతురాయుడు కుళ్లాయి స్వామి మాట్లాడుతూ బుక్కరాయసముద్రం మండలంలోని ఉన్న ప్రతిభా పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్డులో ఇంటిలో విద్యాసంస్థలు నిర్వహిస్తామన్నారు, చిన్న చిన్న గదులు ఏర్పాటు చేసుకొని ఒక గదిలో 30 నుంచి 50 మంది విద్యార్థులను ఉంచి పాఠశాల నిర్వహిస్తామన్నారు గతంలో రేకుల షెడ్డులో పాఠశాల నిర్వహిస్తున్న దానిలో బండలు విరిగిపడి విద్యార్థుల ప్రాణాలు పోవడం జరిగిందని గుర్తు చేశారు. ఇరుకైన గదులలో విద్యార్థులను ఉంచుతూ కనీసం పాఠశాలకు గ్రౌండ్ లేకుండా హైవేకి దగ్గరలోనే గేటు పెట్టుకొని విద్యార్థులు బయటకు వస్తే కనీసం స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయకుండా అటువైపు నుంచి ఎవరైనా స్పీడ్ గా వస్తే విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలుస్తాయని పేర్కొన్నారు. ప్రతిభ పాఠశాల పైన జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంక్వైరీ చేయాలని కోరారు.. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రైవేట్ పాఠశాలలు రేకుల షెడ్డులలో నిర్వహిస్తూ గ్రౌండ్ లేకుండా ఇరుకైన గదులు ఏర్పాటు చేసుకొని సరైన వసతులు ఏర్పాటు చేయకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సెలవు దినాలలో తరగతులు నిర్వహించరాదని డీఈవో గారు తెలిపినప్పటికీ వారి ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతి సెలవు దినాలలో తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రతిభ పాఠశాలను సీజ్ చేయాలని అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా రేకుల షెడ్డులలో నిర్వహిస్తున్న పాఠశాల పైన ఎంక్వయిరీ చేసి వాటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యాసంస్థల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు మంజునాథ్ జిల్లా సహాయ కార్యదర్శి చందు నగర కోశాధికారి నాని నాయకులు బాబ్జాన్ అఫీన్ సాయి రాజు సన్నీ సంతోష్ విక్రమ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు









Comments