మచిలీపట్నానికి 70kmల దూరంలో తుఫాన్
ఆంధ్ర ప్రదేశ్ : బంగాళాఖాతంలో మొంథా తుఫాన్ గంటకు 15km వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 70 km, కాకినాడకు 150 km, విశాఖపట్నానికి 250 km దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో 90-110కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు.









Comments