ఫస్ట్ ఉమెన్ లాయర్ ‘కార్నేలియా’
మహిళలు ఇంటికే పరిమితమైన రోజుల్లో లండన్ వెళ్లి న్యాయశాస్త్రం అభ్యసించారు కార్నేలియా సొరాబ్జీ. నాసిక్‌లో 1866లో జన్మించిన ఈమె బాంబే వర్సిటీలో డిగ్రీ చేసిన తొలి మహిళగా నిలిచారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో లా చదివిన తొలి భారత మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు. మహిళలు లాయర్ వృత్తిని చేపట్టడానికి అనుమతి వచ్చాక 1924లో బారిస్టర్‌గా గుర్తింపుపొందారు. ఈమె పేదల తరఫున వందల కేసులను ఉచితంగా వాదించారు.
Comments