• Oct 26, 2025
  • NPN Log

    గత రెండు మూడు రోజలుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉయదం 6.30 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.1,25,560కు చేరుకుంది. 22 క్యారెట్ బంగారం ధర రూ.1,15,150కు పెరిగింది. కిలో వెండి ధర రూ.1,70,000 వద్ద ఉంది . హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.1,25,650గా ఉంది. ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,15,150కు చేరుకుంది.

    అంతర్జాతీయ మార్కెట్‌ల్లో ఔన్స్ బంగారం ధర 4,113 డాలర్లుగా ఉంది. ఔన్స్ వెండి ధర 54 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. ఇప్పటివరకూ ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్థిరీకరణ దిశగా వెళుతున్నట్టు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అమెరికా చైనా మధ్య వాణిజ్య బంధం మెరుగయ్యే అవకాశం ఉండటంతో బంగారానికి డిమాండ్ తగ్గి అమెరికా స్టాక్స్, ప్రభుత్వ బాండ్స్‌లోకి పెట్టుబడులు మళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం రేటు దాదాపు 57 శాతం మేర పెరిగి ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోళ్లకు దిగడం, ఈఏటీఎఫ్‌లల్లోకి నిధుల వెల్లువ వంటివన్నీ బంగారం ధర పెరుగదలకు కారణమయ్యాయి.


     

    దేశంలో వివిధ నగారల్లో బంగారం రేట్స్ ఇవీ.

    చెన్నై: ₹1,25,450; ₹1,15,000 ₹96,250

    ముంబై: ₹1,25,620; ₹1,15,150 ₹94,220

    ఢిల్లీ: ₹1,25,770; ₹1,15,300 ₹94,370

    కోల్‌కతా: ₹1,25,620; ₹1,15,150 ₹94,220

    బెంగళూరు: ₹1,25,620; ₹1,15,150 ₹94,220

    హైదరాబాద్: ₹1,25,620; ₹1,15,150 ₹94,220

    కేరళ: ₹1,25,620; ₹1,15,150 ₹94,220

    పూణె: ₹1,25,620; ₹1,15,150 ₹94,220

    వడోదరా: ₹1,25,670; ₹1,15,150 ₹94,270

    అహ్మదాబాద్: ₹1,25,670; ₹1,15,150 ₹94,270

    కిలో వెండి ధరలు ఇవీ

    చెన్నై: ₹1,70,000;

    ముంబై: ₹1,55,000;

    ఢిల్లీ: ₹1,55,000;

    కోల్‌కతా: ₹1,55,000;

    బెంగళూరు: ₹1,57,000;

    హైదరాబాద్: ₹1,70,000;

    కేరళ: ₹1,70,000;

    పూణె: ₹1,55,000;

    వడోదరా: ₹1,55,000;

    అహ్మదాబాద్: ₹1,55,000;

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).