భారత్‌తో మ్యాచ్.. పాక్ కెప్టెన్ ఏమన్నారంటే?
ఉమెన్స్ క్రికెట్ లో ఇవాళ భారత్ తో మ్యాచులో తమ ఆటతీరుపైనే ఫోకస్ పెడతామని పాక్ కెప్టెన్ ఫాతిమా సనా తెలిపారు. గతంలో ఇరు జట్ల ప్లేయర్లు ఫ్రెండ్లీగా ఫొటోలు దిగగా, ప్రస్తుత పరిస్థితులపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘అన్ని జట్ల ప్లేయర్లతో మాకు మంచి రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. అందరితో బాగుండేందుకు ప్రయత్నిస్తాం. గేమ్ స్పిరిట్‌కు అనుగుణంగా నడుచుకుంటాం. మా దృష్టంతా క్రికెట్‌పైనే’ అని స్పష్టం చేశారు.
Comments