భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులుఅర్పించిన గౌరవ మాజీ ఎమ్మెల్యే, రంపచోడవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి గారు
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వైరాంవరం మండలం వై రామవరం లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి గౌరవ మాజీ ఎమ్మెల్యే, రంపచోడవరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి గారు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని సమాజంలో అంటరానితనం నిర్మూలన వివక్షపై అలుపెరగని పోరాటం చేశారని, భారత రాజ్యాంగ నిర్మాత అని, భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వై రామవరం మండల ఎంపీపీ కడ బాల ఆనంద్, జడ్పిటిసి వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ విశ్వమ్మ, కార్యకర్తలు, కమిటీ సభ్యులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు










Comments