మాలలో పార్టీకి వెళ్లిన చరణ్‌పై విమర్శలు.. శిరీష్ క్లారిటీ!
హీరో అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీకి అయ్యప్ప మాలలో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెళ్లడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శిరీష్ స్పందించారు. ‘చరణ్ ఆ పార్టీకి చాలా తొందరగా వచ్చారు. అప్పటికి అక్కడ ఎవరూ లేరు. పార్టీ కూడా మొదలుకాలేదు. ఎవరూ ఆల్కహాల్ కూడా ముట్టుకోలేదు. ఆయన మమ్మల్ని విష్ చేసి ఫొటో దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు’ అని తెలిపారు. మార్చి 6న శిరీష్ వివాహం జరగనుంది.










Comments