యాదగిరీశుడి సేవలో సింధు దంపతులు
యాదగిరిగుట్ట : బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, వెంకటదత్త సాయి దంపతులు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని శనివారం దర్శించుకున్నారు. స్వామివారి నిత్య కల్యాణోత్సవంలో సింధు కుటుంబసభ్యులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు.
Comments