రాముడిగా మహేశ్ బాబు.. లుక్ అదిరిందిగా!
వారణాసిలో శ్రీరాముడిగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు లుక్ వైరలవుతోంది. గుంటూరులోని మైత్రీ సినిమాస్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ పోస్టర్‌ను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ధనుస్సుతో శ్రీరాముడిగా మహేశ్ బాబు పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వారణాసి టీమ్ ఇంకా దీనిపై అధికారికంగా అప్డేట్ రిలీజ్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో మహేశ్ రాముడి పాత్రలో కనిపిస్తారని రాజమౌళి గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.










Comments