ర్యాంకింగ్స్‌లో అభిషేక్ రికార్డు
దుబాయ్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అభిషేక్ 931 రేటింగ్ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. 2020లో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్ సాధించిన 919 రేటింగ్ పాయింట్ల రికార్డును 25 ఏళ్ల అభిషేక్ అధిగమించాడు. ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ రెండో ర్యాంక్‌లో, హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ మూడో స్థానంలో కొనసాగుతుండగా, సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు దిగజారి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో వరుణ్ చక్రవర్తి 803 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోగా, కివీస్ బౌలర్ జాకోబ్ డఫీ రెండో స్థానంలో నిలిచాడు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో ర్యాంక్‌లో నిలవగా, పాక్ ఆల్‌రౌండర్ సయీమ్ ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు.
Comments