రవితేజ అనార్కలి.. పేరు మారిందా?
రవితేజ , కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీనికి ‘అనార్కలీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని కొంతకాలంగా టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఫన్నీ టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. జనరల్‌గా మైక్ అనౌన్స్‌మెంట్‌లో ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ అన్నది ఎక్కువగా అంటుంటాం. ఈ సినిమా భర్తలకు సంబంధించినది కాబట్టి అలా మార్చారని చిత్ర వర్గాల నుంచి సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దీపావళికి ఫస్ట్ లుక్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్ సిద్దం చేశాం. దసరాకు విడుదల చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో ‘మాస్ జాతర’ సినిమా ఉంది. ఈనెల 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఆ సినిమా విడుదల తర్వాతే దర్శకుడు కిశోర్ ప్రచార కార్యక్రమాలు మొదలుపెడతారని తెలిసింది. ఎస్.ఎల్.వి. సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అషికా రంగనాథ్, కేతిక శర్మ కథానాయికలు.
Comments