• Oct 05, 2025
  • NPN Log

    అహ్మదాబాద్‌: స్వదేశంలో టెస్ట్‌ సిరీస్‌ అంటే భారత్‌ తిరుగుండదు. కానీ, న్యూజిలాండ్‌ చేతిలో 0-3తో ఘోర పరాజయం తర్వాత అంతా తారుమారైంది. అయితే, సొంతగడ్డపై కొత్త కెప్టెన్‌ శుభ్‌మన్‌ ఘనంగా బోణీ చేయాలనుకొంటున్నాడు. వెస్టిండీ్‌సతో రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా తొలి మ్యాచ్‌ గురువారం నుంచి జరగనుంది. ర్యాంకింగ్స్‌లో భారత్‌ నాలుగు.. విండీస్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. విండీస్‌ ఫామ్‌ దృష్ట్యా ఈ మ్యాచ్‌లో భారత్‌ ఫేవరెట్‌ అనడంతో ఎటువంటి సందేహం లేదు. అయితే, కరీబియన్లు ఏమేరకు పోటీ ఇస్తారనేదే ఆసక్తికరం. ఆసియా కప్‌ ముగిసిన వెంటనే స్వదేశానికి చేరుకొన్న గిల్‌ టెస్ట్‌ మోడ్‌లోకి మారిపోయాడు. టీ20ల్లో గిల్‌ ఆశించిన రీతిలో రాణించలేకపోయినా.. ఇంగ్లండ్‌ సిరీ్‌సలో తరహాలో మరోసారి చెలరేగాలనుకొంటున్నాడు. అంతేకాకుండా డబ్ల్యూటీసీ పాయింట్లు కూడా భారత్‌కు ఎంతో కీలకం. అయితే, మేఘావృతమైన వాతావరణానికి తోడు పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉండడంతో టీమ్‌ కూర్పుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. రోహిత్‌, కోహ్లీ, అశ్విన్‌ రిటైర్మెంట్‌ తర్వాత స్వదేశంలో జరుగుతున్న తొలి సిరీస్‌ కావడంతో వారి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.


    బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమతుల్యత కనిపిస్తోంది. అయితే, పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌, బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌లో ఎవరికి తుదిజట్టులో చోటు దక్కుతుందనేది చూడాలి. జడేజా, కుల్దీప్‌ స్పిన్‌ విభాగానికి నేతృత్వం వహించనుండగా.. కౌంటీలు ఆడి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ తీవ్రంగా ప్రాక్టీస్‌ చేశాడు. కరుణ్‌ నాయర్‌పై వేటుపడడంతో.. వన్‌డౌన్‌లో సాయి సుదర్శన్‌ స్థానానికి ఢోకాలేదు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. జైస్వాల్‌ కొంత బ్రేక్‌ తర్వాత బరిలోకి దిగుతున్నాడు. బుమ్రా, సిరాజ్‌ పేస్‌ భారాన్ని మోయనున్నారు. ఇటీవలే నేపాల్‌ చేతిలో ఓడిన విండీస్‌ పరిస్థితి మరింత దీనంగా ఉంది. గాయాల కారణంగా షామర్‌ జోసెఫ్‌, అల్జారీ జోసెఫ్‌ దూరం కావడంతో జట్టు కష్టాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో రోస్టన్‌ చేజ్‌ సేన భారత్‌కు ఏమేరకు పోటీ ఇస్తుందో చూడాలి.

    జట్లు (అంచనా)

    భారత్‌: జైస్వాల్‌, రాహుల్‌, సాయి సుదర్శన్‌, గిల్‌ (కెప్టెన్‌), ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), నితీశ్‌ కుమార్‌/పడిక్కల్‌, జడేజా, సుందర్‌, కుల్దీ ప్‌/ప్రసిద్ధ్‌ కృష్ణ, బుమ్రా, సిరాజ్‌.

    వెస్టిండీస్‌: తేజ్‌నరైన్‌ చందర్‌పాల్‌, కెవలాన్‌ అండర్సన్‌, అలిక్‌ అథనజె, బ్రండన్‌ కింగ్‌, షాయ్‌ హోప్‌ (వికెట్‌ కీపర్‌), రోస్టన్‌ చేజ్‌ (కెప్టెన్‌), జస్టిన్‌ గ్రీవ్స్‌, కరే పియర్రీ, జోమెల్‌ వారికన్‌, అండర్సన్‌ ఫిలి్‌ప/జోహన్నా లేన్‌. జేడెన్‌ సీల్స్‌.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement