వైద్య శిబిరాలను సందర్శించిన కలెక్టర్ దినేష్ కుమార్ !
అల్లూరిసీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, రాజవొమ్మంగి మండల పరిధిలోని లబ్బర్తి,లాగరాయి, కిండ్ర గ్రామాలలోని ప్రజలు గత 3నెలలుగా కీళ్ల నొప్పులు, జ్వరాలతో బాధ పడుతున్న విషయం తెలిసినదే,దాని నిమితమై వైద్య ఆరోగ్యశాఖ ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసినవైద్య శిబిరాలను కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు.పరిస్థితిని DM&H డా. విశ్వేశ్వర నాయుడు,డా.శిరీష,డా.డేవిడ్లను అడిగి తెలుసుకున్నారు.యిప్పటికే 3 టీంలను నియమించామని,వ్యాధి లక్షణాలనుబట్టి వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టమని సూచించారు.రోగులకు ధైర్యం చెప్పారు.ఈ గ్రామాల్లో పారిశుధ్య లోపం గుర్తించానని, పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలనీ దానికి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ ను, సిబ్బందిని హెచ్చరించారు.దోమల నివారణ చెర్యలు చేపట్టాలని మలేరియా సిబ్బందికి హెచ్చరించారు. దోమల మందును ఇంటిలోపల కూడా స్ప్రే చేయించు కోవాలని ప్రజలను కోరారు.
Comments