వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయండిలా..
ఈరోజుల్లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. అయితే ఆఫీస్, ఇల్లు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఈజీ కాదు. కాబట్టి మహిళలు తమ చుట్టూ హెల్పింగ్ మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిపనుల్లో కుటుంబసభ్యుల సాయం తీసుకోండి. ఆఫీస్‌లో వర్క్‌లోడ్ ఎక్కువైతే సహోద్యోగులతో పని పంచుకోండి. అవసరమైనప్పుడు మీరూ వారికి సాయపడాలి. ఇలా చేస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వీటితోపాటు కుటుంబంతో సరదాగా సమయం గడపడమూ ముఖ్యమే.
Comments